calender_icon.png 6 November, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ వెంటే ముస్లింలు

06-11-2025 02:02:44 AM

  1. జూబ్లీహిల్స్‌లో విజయం సాధిస్తాం
  2. మంత్రి అజారుద్దీన్ ధీమా

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాం తి) : ముస్లింలు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజ యం సాధిస్తామని మంత్రి అజారుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ రెండు కలిసే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పని చేస్తున్నాయని ఆయన విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌లో మాజీ మంత్రి షబ్బీర్‌అలీతో కలిసి అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో ఇతర పార్టీలు ప్రచారాలు ఎక్కడా కనిపించడం లేదని, కాంగ్రెస్ వైపే అన్ని వర్గా ల ప్రజలు చూస్తున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందన్నారు.

పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు. హైదరాబాద్ క్రికెట్ కోసం తానెంతో కృషిచేశానని, తనపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు మంత్రిగా అవకాశమిచ్చిందని, సీఎం రేవంత్‌రెడ్డి తనను నమ్మి పదవి ఇచ్చారని తెలిపారు. 6 నెలలు మంత్రి అని నా పైన విమర్శలు చేయడం వాళ్లకే వదిలేస్తున్నట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్, కేటీఆర్ ముస్లింల కోసం ఏం చేశారో చెప్పాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పదేళ్లలో ఏం చేసిందో చెబితే.. రెండేళ్లలో తాము ఏమి చేశామో చెప్పడానికి సిద్ధమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా హిందూ, ముస్లింలు అనే భేదం చూపడం లేదని,  కేసీఆర్, కేటీఆర్ మాత్రమే ఆ పని చేస్తున్నారని విమర్శించారు. ఉర్దూ టీచర్లను భర్తీ  చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు.