calender_icon.png 6 November, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధారావాహికలా పినపాక రాజకీయం

06-11-2025 12:23:36 AM

  1. పాయం వర్సెస్ రేగా మధ్య డైలాగ్ వార్ 

సవాళ్లు, ప్రతి సవాళ్లతో మాటలయుద్ధం

ఇద్దరూ ఇద్దరే.. భవనం కోసం నేతల పంతం 

రగులుతున్న వివాదం

కాక రేపుతున్న కార్యాలయ రాజకీయం 

నాడు వారి అడ్డగింత , నేడు వీరి స్వాధీనం 

ముమ్మాటికీ కాంగ్రెస్ కార్యాలయమే

స్థల దాత పిల్లారి శెట్టి 

ప్రజలు పరేషాన్ 

మణుగూరు, నవంబర్ 5, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పిన పాక నియోజకవర్గంలో తాజా రాజకీయం కాక రేపుతుంది. నాయకుల మధ్య డైలాగ్ డైనమైట్లు పేలుతున్నాయి. గత ఆదివారం పార్టీ కార్యాలయ వివాదంలో కాంగ్రెస్, బీ ఆర్‌ఎస్ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడిన విషయం విధితమే.

దీంతో ఇక్కడ సిట్టింగ్ ఎ మ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మె ల్యే రేగా కాంతారావు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది.కార్యాలయ వివాదం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. నియోజకవర్గంలో రాజకీయ రణం ఇప్పుడు తాజా ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యు ద్ధంగామారింది.దీనిపైవిజయక్రాంతి కథనం

ఇద్దరి మధ్య డైలాగ్ వార్..

పాయం, రేగా కాంతారావు ఇరువురు రాజకీయాలలో సుదీర్ఘ ప్రస్థానం కల నాయకులు. ఇరు పార్టీలలో బలమైన నాయకులు అలాంటి వారు ఉన్నచోట ఏ కార్యకర్తల మ ధ్యఏ చిన్న గొడవ జరిగిన వివాదానికి దారితీస్తోంది. ఇప్పుడు ఇక్కడ అదే చోటుచేసు కుంది. ఆదివారం జరిగిన కార్యాలయ వివాదంతో పార్టీ ఆఫీస్‌మాదే అంటూ ఒకరి ఫై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లో ని లుస్తున్నారు.

ఇద్దరి మధ్య మాటల తూటాలు ఎగిసి పడు తూ, మంటలు రేగుతున్నాయి. సినిమా హీరోల రేంజ్లో పరస్ప రం డైలాగ్లు పేల్చుకుంటూ ఒకరు ఫైటర్ ననీ మరొకరు షూటర్ ను అంటూ  రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. ప్రజలకు కావాల్సి నంత వినోదం పంచుతున్నారు. గత రెండు రోజుల నుండి వరస ప్రెస్ మీట్ లతో డైలాగులు చెబుతున్న జనానికి మాత్రం కామెడీ సినిమా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది.

నాడు వారి అడ్డగింత , నేడు వీరి స్వాధీనం..

కాంగ్రెస్ పార్టీ టిక్పె 2018 ఎన్నికల్లో పినపాక ఎమ్మెల్యేగా రేగాకాంతారావు గెలిచారు. అనంతరం 2019లో టీఆర్ ఎస్లో చేరుతున్న ట్లు ప్రకటించి పార్టీ మారారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉన్న ఈ భవనాన్ని ఆ తర్వాత టీఆర్‌ఎస్ పార్టీ కార్యాల యంగా కాంతారావు మార్చారు.

దీనినీ తీవ్రంగా వ్యతిరే కించిన కాంగ్రెస్ నాయకు లు, ఆయన పార్టీ మారితే అభ్యంతరం లేద ని, కార్యాలయం ఆక్రమణ ఏమిటని ఆయన తీరును తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. వ్యతిరేక చర్యలను ఖండించిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేశారు. 

పట్టణంలోని అంబేద్కర్ సెం టర్లో నిరాహార దీక్షలను కూడా చేపట్టారు. ఈ విషయంపై సంపూర్ణ మద్దతు తెలుపుతూ.. అప్పటి సీఎల్పీ నేత, మధిర ఎమ్మె ల్యే మల్లు బట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఎంపీ బలరామ్ నాయక్ ఆందోళనలో పాల్గొన్నారు. కానీ వారిని పోలీస్ బలగాలతో ఎక్కడికి అక్కడ అడ్డుకొని వెనుకకు పంపారు.

వీరయ్యను ఒక్కరికే అనుమతివ్వడం తోమునిసిపల్ కార్యాలయానికి వెళ్లి అధికారులను ప్రశ్నించారు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకే చెందాలని చెప్పి వెళ్లారు. నాడు వారు అధికార బలం తో అడ్డ గించిన ఘటనను పునరావృతం చేస్తూ తిరిగి అదే అస్త్రంతో కాంగ్రెస్ తమ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవటం కొసమెరుపు. 

ఇద్దరూ ఇద్దరే, ఫిరాయింపులే...

కమ్యూనిస్టు పార్టీలో ఓనమాలు దిద్ది, నాయకుడుగా ఎదిగిన పాయం వెంకటేశ్వర్లు 2004లో తొలిసారి సిపిఐ నుండి, ఆ తర్వాత వైసీపీలో చేరి 2014 లో ఎమ్మె ల్యే గా గెలిచిన పాయం అనంతరం టిఆర్‌ఎస్ లో చేరారు. 2023లో మరోసారి పాయం పార్టీ మారారు. బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

కాగా, రేగా కాంతారావు 2009లో కాంగ్రెస్ నుంచి శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 2018లో మరోసారి గెలిచిన కాంతారావు 2019లో బిఆర్‌ఎస్ లో చేరారు. ఒక రకంగా రేగా కాంతారావు, పా యం ఇద్దరు ఒక పార్టీలో గెలుపొంది మరో పార్టీలోకి మారిన ఫిరాయింపు దారులే. 

రగులుతున్న వివాదం..

ఇరు పార్టీల మధ్య కార్యాలయ వివాదం ఇప్పుడు శాంతిభద్రతల సమస్యగా మారిం ది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాం శమైంది. ఈ వివాదానికి పార్టీ పిరాయించిన నాయకులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం రగులుతున్న వివాదంకు నాయకుల వైఖరి ప్రధాన కారణంగా మారింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై మరొకరు కత్తులు దూస్తు సమరం జరుపుతున్నారు.

ఇంతేకాక కార్యాలయం మాదే అంటూ రెండు పార్టీల నాయకులు ఓ వ్యక్తి దగ్గరే కొనుగోలు చేశామని మీడియాకు చూపడంతో మరో వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. చందా హరి కృష్ణ వద్ద నుంచి 2024 లో తాము కొనుగోలు చేశా మని రేగా, తాము 2023లో హరికృష్ణ దగ్గర నుంచి కొనుగోలు చేశామని పాయం వివరాలను మీడి యాకు చూపడం ఆసక్తిక రంగా మారింది.

పార్టీల రాజకీయం హరి కృష్ణ చుట్టూ తిరుగుతుంది. హరికృష్ణ అనే వ్యక్తి రేగా కాంతారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వ్యక్తిగత సహయకుని గా పనిచేశారు. కానీ 2019 వరకు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా పేరు నమోదయింది. రికార్డులలో సైతం అదే పేరు తో అధికారులు బిల్లులు కట్టిం చుకున్నారని, కాంగ్రెస్ నాయకులు పదే పదే గుర్తు చేస్తున్నారు. కానీ ఈ పార్టీ కార్యాలయం ప్రస్తుతం హరికృష్ణ పేరు మీద ఉండటం గమనార్హం.

ఇక్కడే అసలైన ఆంతర్యం దాగి ఉంది. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యాలయ పేరు మార్పిడి ఎందుకు మార్చలే దనే ప్రశ్నలు, మరోవైపు బిఆర్‌ఎస్ పార్టీ కూడా ఎందుకు దస్రాలు మార్పిడి చేయలేదు అనే సందేహాలు సర్వత్ర వెలువడున్నాయి. అసలు కార్యాలయం ఎవరిదైనా సరే పార్టీ పేరున కాకుండా అనుచర వ్యక్తుల పేరిట ఎందుకు పెడుతున్నారనే సందేహాలు వెళ్ళువెతుతున్నాయి.

రాజ్యా గబద్ధంగా నమోదైన పార్టీలు వ్యక్తుల పేరిట పార్టీల ప్రాపర్టీని ఎలా పెడతారని రాజకీయ విశ్లేషకుల సందేహం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తుల పేరిట నమోదుతో జరుగుతున్న పరిణామాలతో ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని, ఒకరిపై కోపంతో మరొకరు దాడులతో అలజడి రేపుతున్నారని ఇకనైనా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఆలోచన చేయాలని, మరో సారి ఇలాంటి ఘటనలో పునరావృతం కాకుండా తమ తమ పార్టీల పేరుతోనే కార్యాలయ పేర్లు నమోదు చేయాలని, అప్పుడే వారికి ఆయా పార్టీల పట్ల నిజమైన చిత్తశుద్ధి , కార్యకర్తలకు నమ్మకం కలుగుతుందని పలువురు కోరుతున్నా రు.

ముమ్మాటికీ కాంగ్రెస్ కార్యాలయమే మణుగూరులోని పార్టీ కార్యాలయం ముమ్మటికీ కాంగ్రెస్ పార్టీదేనని స్ధల దాత వారసుడు పీకేఎస్ హరిబాబు మీడియా కు తెలిపారు. 1980లో తన తండ్రి పిళ్ళారిశెట్టి సత్యనారాయణ వద్దకు నాటి ఎమ్మెల్యే చందాలింగయ్య, మండల కాంగ్రెస్ నాయకులు బత్తుల వీరయ్య, పోలమూరి రాజు వచ్చి కాంగ్రెస్ కార్యాలయం కోసం స్థలం అడిగారని తెలిపారు.

కాంగ్రెస్ ఫై ఉన్న అభిమానంతో తన తండ్రి ఈ స్థలాన్ని కేటాయించ గా, అక్కడ భననాన్ని నిర్మించి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తర్వాత నాయకులు పార్టీలు మారార ని, ఆ తర్వాత కార్యాలయాన్ని మార్చారని చెప్పారు.ఏది ఏమైనా వివాదాస్పదంగా మా రిన పార్టీ కార్యాలయం పై ఎవరు పై చేయి సాధించి పంతం నెగ్గించుకుంటారో, మరెవరు అభాసు పాలవుతారో తెలలంటే మరి కొన్ని రోజులు వేసి చూడాలి.