calender_icon.png 6 November, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి ఆమడదూరంలో అల్లీపూర్

06-11-2025 12:19:13 AM

- అధ్వాన్నంగా మురికి కాలువలు, రోడ్లు

- ప్రజాభిప్రాయం లేకుండానే మున్సిపాలిటీలో విలీనం

- పట్టించుకోని మున్సిపల్ అధికారులు

- పంచాయతీగా గానే తిరిగి మార్చాలి

జహీరాబాద్, నవంబర్ 5 :జహీరాబాద్ మున్సిపాలిటీలో విలీనం తర్వాత అల్లీపూర్ గ్రామానికి గ్రహణం చుట్టుకుంది. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడంతో ప్రజ లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే గ్రామాన్ని మున్సిపాలిటీ పరిధిలోకి చేర్చడంతో ప్రజల కష్టసుఖాలను పట్టించుకునే వారు కరువయ్యారు.

మురుగు కాలువలు నిండినా.. రో డ్లు ధ్వంసం అయినా.. పాఠశాలతో పాటు వివిధ ప్రజోపకరమైన పనులు జరగడం లేదు. గ్రామ పంచాయతీగా ఉన్న రోజుల్లో విధి దీపాలు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరాతో పాటు వివిధ పనులు సత్వరమే జరి గేవి. మున్సిపాలిటీలో విలీనం తర్వాత ఇల్లు నిర్మించుకోవాలన్నా వాటి అనుమతులు పొందాలన్నా మున్సిపల్ అధికారులు గ్రా మాన్ని పట్టించుకోవడంలేదని గ్రామ ప్రజ లు ఆరోపిస్తున్నారు.

గ్రామ పంచాయతీగా ఉన్న కాలంలో గ్రామానికి చెందిన వ్యక్తి స ర్పంచ్ గా, వార్డ్ మెంబర్లుగా, గ్రామపంచాయతీ సెక్రెటరీ తదితరులు గ్రామానికి సం బంధించిన వివిధ పనులను పర్యవేక్షించి వారికి కావలసిన పనులను చూసేవారు. మున్సిపాలిటీలో విలీనం తర్వాత గ్రామంలో నెలకొన్న సమస్యలు తీవ్రమవుతున్నాయి. జహీరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు రెండు పర్యాయాలుగా వాయిదా పడడంతో గ్రా మంలో సమస్యలు తిష్ట వేస్తున్నాయి. పాఠశాలలో కూడా విద్యార్థులకు కావలసిన  సదుపాయాలను మునిసిపాలిటీ అధికారులు చేపట్టకపోవడంతో వాటిలో పందు లు, కుక్కలు చేరి పాఠశాల పరిసరాలు అపరిశుభ్రం చేస్తున్నాయి.

ఎవరైనా ఇల్లు కట్టుకో వాలంటే గతంలో గ్రామపంచాయతీ సర్పం చ్ కానీ గ్రామ సెక్రెటరీకి దరఖాస్తు పెట్టుకుంటే సకాలంలోనే అనుమతులు వచ్చేవి. గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయ డం వల్ల మున్సిపల్ కార్యాలయానికి వెళ్లినా అధికారులు సకాలంలో పనులు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ప్రధాన రహదారి నుండి గ్రామానికి వెళ్లే రోడ్డు 10 సంవత్సరాలుగా ధ్వంసం అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ప్రతి సంవత్సరం పన్నులు కడుతు న్నామే తప్ప గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయడం లేదు.

ఈ సంవత్సరం పన్నులు వసూలు చేయడానికి గ్రామానికి వచ్చిన అ ధికారులను ప్రజలు నిలదీయడంతో పన్ను లు వసూలు చేయకుండానే వెళ్లిపోయారు. ఈ గ్రామంలో నివసించే ప్రజలు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో ఉండడంవల్ల నిత్యం వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తున్నారు. దర్గా నుండి అల్లిపురం గ్రామం వరకు రోడ్డు ధ్వంసమైనా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహ రిస్తున్నారు. గతంలో సర్పంచ్ గ్రామ పరిపాలన వ్యవస్థ బాగుండేదని ప్రస్తుతం గ్రామా న్ని మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని తమ గ్రామాన్ని పంచాయతీగానే ఉంచాలని ప్రజ లు కోరుతున్నారు. 

గ్రామ సమస్యలు తీర్చకపోతే మున్సిపాలిటీ నుండి మా గ్రామాన్ని తొలగించాలని కోర్టుకు వెళ్లేందుకు కూడా ఆ గ్రామ ప్రజలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ పాలకవర్గం లేకపోవడం, మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడంతో గ్రామం అభివృద్ధికి ఆమడ దూరం లో ఉందని చెప్పవచ్చు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి గ్రామంలోని మురుగు కాలువలు, గుంతలు పడ్డ రోడ్లను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు.