06-11-2025 01:56:06 AM
నకిలీ డాక్టర్ అరెస్ట్
ఉప్పల్, నవంబర్ 5 (విజయక్రాంతి) : ఇటీవల కాలంలో పాలి క్లినిక్ పేరిట చిన్న ఆస్పత్రులు ప్రారంభించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు నకిలీ డాక్టర్. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకా నగర్ చౌరస్తా సింధు పాలి పేరుతో ఫార్మాసిటీ కిరణ్మయి అని మహిళా హోమి యోపతి వైద్యుడు సిద్ధికింది బాల సిద్ధులు ను నియమించుకొని అల్లోపతి వైద్యం చేస్తూ సరైన చెల్లుబాటే లేని సర్టిఫికెట్ ల తో వైద్యం చేస్తారని సమాచారం మేరకు ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ నేతృత్వంలో ఉప్పల్ అడ్మిన్ ఎస్‌ఐ మాధవరెడ్డి ఆసుపత్రిపై దాడులు నిర్వహించారు. దాడుల్లో నకిలీ వైద్యుడిగా తేలడంతో పోలీసులు క్లినిక్ ను సీజ్ చేసి నకిలీ వైద్యుడు బాల సిద్ధులు ఫార్మసిట్ కిరణ్ మై అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు దర్యాప్తు చేసినట్టు పోలీసులు తెలిపారు.