06-11-2025 12:05:13 AM
పది రోజుల్లో.. 50 మంది ప్రాణాలు గాలిలో..
తాజాగా కొయ్యగుట్ట దగ్గర కారు .. టీవీఎస్ బైక్ ఢీ..
ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు..
బాన్సువాడ, నవంబర్ 5 (విజయ క్రాంతి): తెలంగాణ రెండు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారులు రక్తసితమై ఈ ఘటనల్లో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మృత్యు ప్రయాణం నీడలో ద్విచక్ర, భారీ వాహనాదారుల రాకపోకలు సాగుతున్నాయి. ఇంటిల్లిపాదిని వదిలి తిరిగి వస్తామన్న భరోసా లేకుండా పోయింది.
గడప దాటిన ఇంటి యజమాని మళ్లీ భార్యాబిడ్డలను చూసుకునే పరిస్థితి లేకుండా ఉంది. ఏమిటో తెలియదు కానీ, అమాయకుల ప్రాణాలు మాత్రం మృత్యు రూపంలో రోడ్డు ప్రమాదం కబలించేస్తుంది. గత పది రోజుల వ్యవధిలోని అటు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో జరిగిన ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదంలో 22 మంది మృతి చెందగా, తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన సంఘటనలో మరో 20 మంది రోడ్డు ప్రమాదంలో బలయ్యారు.
ఈ సంఘటనలో మృత్యువాత పడిన వారి పరిస్థితి తలుచుకుంటేనే మనసున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచి వేస్తుంది. ఇంటికి తిరుగు వస్తానని చెప్పి ప్రయాణమైన తమ వ్యక్తులు తిరిగిరాని లోకాలకు చేరుకోవడం కుటుంబీకుల రోదన అంతా.. ఇంతా కాదు. ఎందుకో ఈమధ్య తెలంగాణలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి. పది రోజుల వ్యవధిలోని సంభవించిన రోడ్డు ప్రమాదాలు 50 మందిని బలిగొన్నాయి.
తల్లితండ్రుల కూతుళ్ళను కోల్పోయి కొందరు బాధపడుతుం డగా, కన్న కూతుళ్లను కోల్పోయి తల్లిదండ్రుల రోదనలు మిన్నట్టుతున్నాయి. ఒడిలో ఉన్న పసిపాప తల్లికి దూరమై తనువు చాలిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటు న్నాయి. ఇలాంటి హృదయ విదారక సంఘటనలు అక్టోబర్, నవంబర్ మాసంలోనే చోటుచేసుకున్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఎక్కడ లోపం జరుగుతుందో కానీ, రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి...
తాజాగా బాన్సువాడలో మరో వ్యక్తి మృతి..
తాజాగా మంగళవారం మరో రెండు చోట్లలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని నలుగురు మృతి చెందారు. అందులో బాన్సువాడ పట్టణానికి సమీపంలోని కొయ్యగుట్ట ప్రాంతంలో మరో సంఘటన చోటుచేసుకుంది. అతివేగం, మధ్యమతులో వాహనాన్ని నడిపి ఢీ కొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
కొయ్య గుట్ట వద్ద కారు, టీవీఎస్ బైక్ ఎదురు ఎదురుగా ఢీకొనడంతో ఈ ఘటనలో సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం నాగ్ దర్ తండా చెందిన వస్త్రం మృతి చెందారు, మరొక వ్యక్తి తీవ్ర గాయాలకు గురికావడంతో నిజామాబాద్ తరలించారు. బాన్సువాడ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదకర కారణాలను తెలుసుకుంటున్నారు.
అతివేగం..అజాగ్రత్తనే కారణమా..?
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల విషయంలో అతివేగం అజాగ్రత్తనే కారణమా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న వారిలో యువకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. అతివేగంతో బైక్ రైడ్ చేయడం కంట్రోల్ తప్పి రోడ్డు ప్రమాదాల గురై ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. యువకులు అతివేగంతో వాహనాలను నడపడం వల్లనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
బైక్ రైడింగ్‌లో మైనర్లు..
మైనర్ పిల్లలు సైతం వాహనాల నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురవుతు న్నారు. నిబంధనల విరుద్ధంగా మైనర్ పిల్లలు వానాలను నడిపేందుకు అవకాశం లేదు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం మైనర్ వయసున్న పిల్లలు (బాలిక, బాలురు ) ఐనా బాణాలను నడిపేందుకు చట్టం ఒప్పుకోదు. కానీ కొంతమంది తల్లిదండ్రులు పిల్లల మీద ఉన్న ప్రేమతో మోటార్ వెహికల్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ వానాలను అప్పగించి తమ సంతానాన్ని రోడ్డు ప్రమాదాల్లో కోల్పోతున్న సంఘటనలు కళ్ళ మొదటే కనిపిస్తున్నాయి.
ఈ తప్పిదం తల్లిదండ్రులదే అయినప్పటికీ, నష్టపోతుంది ఎవరు.. ప్రేమతో.. పిల్లలకిచ్చిన వాహనాల తాళాలు వారి బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటి కైనా తల్లిదండ్రులు మైనర్ వయసున్న పిల్లలకు వాహనాలను నడిపేందుకు అవకాశం ఇవ్వడం సరైనది కాదని తెలుసుకోవాలి.
మద్యం మత్తులో..
మద్యం మత్తులో ద్విచక్ర,భారీ వాహనాలను నడుపుతూ ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. తాగిన మైకంలో వాహనాలను నడపొద్దు అంటూ పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, భారీ,ద్విచక్ర వాహనదారులు వారి ఆదేశాలను బేఖాతార్ చేస్తు న్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల రాత్రి వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ఢీకొంటున్న సంఘటనలు చోటు చేసుకుంటు న్నాయి. అదుపుతప్పి వాహనాలను ఢీకొనడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నాయి.
ఈ విషయంలో పోలీస్ శాఖ మద్యం రైడింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ డ్రింక్ అండ్ డ్రైవ్ మాత్రం తగ్గడం లేదు. దీనివల్ల యువత ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిలుస్తున్నారు.
యువకులే కాకుండా పెద్ద వయస్సు ఉన్నవారు సైతం తమకు ఎదురవుతున్న సమస్యలను మర్చిపోయేందుకు మద్యం సేవిస్తున్నారు అని అనుకుంటున్నారు తప్ప, తమ ఇంటికి ఎలా చేరుతామన్న ఆలోచన లేకుండా మద్య మత్తులో వాహనాల నడిపి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనళ్ళో పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబాలు వీధిన పడుతున్నాయి.
పోలీసుల తనిఖీలకు ఫలితమేది..
ప్రతిరోజు పోలీసు శాఖ నిర్వహిస్తున్న పెట్రోలింగ్, వాహనాల తనిఖీల విషయంలో ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది వాహనాలకు సంబంధించి చలాన్లు చెక్ చేయడం, చలాన్లు వేయడమే తప్ప మరే ఇతర అంశాలపై దృష్టి సారించలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కేవలం ద్విచక్ర వాహనాలపై దృష్టి పెడుతున్న పోలీసులు ప్రధాన రహదారులపై తిరుగుతున్న భారీ వాహనాలపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అందుకే భారీ వాహనదారులు మద్యం మత్తులో అతివేగం అజాగ్రత్తతో నడిపి రోడ్డు ప్రమాదాల కారణమవుతున్నారన్న చర్చ జరుగుతుంది.