calender_icon.png 31 October, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ఉండాలి

31-10-2025 12:00:00 AM

 జిల్లా అగ్నిమాపక అధికారి కేశవులు 

ఎల్బీనగర్, అక్టోబర్ 30 : ప్రజలు అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని, అగ్ని ప్రమాద నివారణపై అవగాహన ఉండాలని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి కేశవులు పేర్కొన్నారు. హయత్ నగర్ ఆర్టీసీ 1 డిపోలో గురువారం అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై ఆర్టీసీ సిబ్బందికి అవగాహన ప్రదర్శన నిర్వహించారు. బస్సుల్లో, డిపో ప్రాంగణంలో, పరిసరాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని ఎలా నివారించాలి? అనే అంశాలపై హయత్ నగర్ అగ్నిమాపక కార్యాలయం ఇన్ స్పెక్టర్ యాదగిరి వివరించారు.

ఇటీవల కర్నూల్ బస్సు అగ్ని ప్రమాద ఘటన చాలా బాధాకరమని, ప్రమాదాల నివారణలో డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించాలని సూచించారు. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ... ఆర్టీసీ సిబ్బందికి ఆరోగ్యం, భద్రతపై నిత్యం అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో హయత్ నగర్ 1& 2 డిపో మేనేజర్లు విజయ్, శ్రీనివాసరావు, సహాయ మేనేజర్లు సరస్వతి, సత్తయ్య, సెక్యూరిటీ, విజిలెన్స్  సిబ్బంది పాల్గొన్నారు.