calender_icon.png 31 October, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ములుగు జిల్లా కేంద్రంలో గీత కార్మికుల మహాసభలను జయప్రదం చేయండి

31-10-2025 12:00:00 AM

 కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు పాలకుర్తి శ్రీధర్ గౌడ్ 

కన్నాయిగూడెం, అక్టోబరు30(విజయక్రాంతి):ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో అత్యవసర సమావేశాన్ని కల్లు గీత కార్మిక సంఘం కన్నాయిగూడెం మండల కమిటీ అధ్యక్షులు పాలకుర్తి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఎన్నికల ముందు కల్లు గీత కార్మికులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలనీ ఈసందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున గూర్రేవుల గ్రామంలో తండ ప్రభాకర్ గౌడ్ అధ్యక్షన జరిగిన ముఖ్య సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన పాలకుర్తి శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి సోసైటీకి తాటి ఈత చెట్ల పెంపకం కోసం 10ఎకరాల భూమి ప్రభుత్వంకొని ఇవ్వాలని అన్నారు. ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అనే తేడా లేకుండా అందరికి కాటమయ్య రక్షణ కిట్స్( సెప్టిమొకులు )అందించాలని అన్నారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి కల్లు గీత కార్మికునికి వృత్తి పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

సమస్య ల పరిష్కారం కొరకు నవంబర్ 8న జిల్లా కేంద్రంలో జరుగు కేజీకేస్ జిల్లా సదస్సుకు కన్నాయిగూడెం మండలంలోని గీత కార్మికులు ఇంటికో గౌడ్ ఊరికో వాహనంతో కదిలి రావాలని గీత కార్మికులకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తాటి లచ్చులు పాలకుర్తి కుమారస్వామి గౌడ్ పాలకుర్తి సంతోష్ గౌడ్ పాలకుర్తి బిక్షపతి గౌడ్ నల్లమాసు శ్రీను గౌడ్ చీకటి రాజు గౌడ్ మారగోని సంతోష్ గౌడ్ తో పాటు 20 మంది గీత కార్మికులు పాల్గొన్నారు.