calender_icon.png 7 October, 2025 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నిర్వహణపై సమగ్ర అవగాహన ఉండాలి

07-10-2025 12:12:02 AM

  1. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

ఎన్నికలపై అధికారులకు శిక్షణ కార్యక్రమం 

మెదక్, అక్టోబర్ 6 (విజయక్రాంతి):ఎన్నికలు ప్రారంభం నుండి ముగింపు వరకు సమర్థవంతంగా నిర్వహణపై సిబ్బంది సమగ్రమైన అవగా హన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ పు సమావేశపు హాలులో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వో లు, ఎంపీడీవోలు ఆల్ నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ నుండి లెక్కింపు వరకు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు నామినేషన్ల దాఖలు, అర్హతలు, పరిశీలన, గుర్తులు కేటాయింపు, నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, కేంద్రాలు స్ట్రాంగ్ రూములు ఏర్పాటు తదుపరి ఎన్నికల నిర్వహణలో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు తదితర అన్ని అంశాలపై ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది నిర్వహించాల్సిన కార్యక్రమాలపై దిషా నిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్‌ఓ భుజంగరావు, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, ....డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు,డి పి ఓ యాదయ్య, డి ఈ ఓ రాధకిషన్,ఆర్ డి ఓ లు ,మెదక్. రమాదేవి.. నర్సాపూర్. మహిపాల్ రెడ్డి.. తూఫ్రాన్ జయచంద్రారెడ్డి జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.