calender_icon.png 11 October, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక అనారోగ్య వ్యక్తులపై ఉదారత స్వభావం కలిగి ఉండాలి

11-10-2025 12:16:23 AM

ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలోని  మిషన్ స్కూల్ వద్ద  గిరిజన బాలికల వసతి గృహం నందు అంతర్జాతీయ మానసిక ఆరోగ్య  దినోత్సవాన్ని పురస్కరించుకొని  శుక్రవారం ఇల్లందు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయచైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. మానసిక రోగులపట్ల  ఉదారత స్వభావం కలిగి ఉండాలని, సేవా భావంతో కలిగి ఉండాలని, సంఘంలో గాని,  కుటుంబంలో గానీ, విద్యార్థిని విద్యార్థుల్లో గాని, ఇలాంటి వ్యక్తులు ఉన్నట్లయితే వారికి సాయం అందించాలని,  ఇలాంటి వ్యక్తులు మీకు కనబడునట్లయితే  వీలైతే సహాయం అందించాలన్నారు, 

లేదా వారి సంరక్షణ కొరకు టోల్ ఫ్రీ నెంబర్ (14416) ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే  సంబంధించిన అధికారులు వచ్చి వారిని సంరక్షణ కేంద్రానికి తీసుకువెళ్లి వారి యొక్క బాగోగులు చూసుకుంటారని తెలిపారు.  ముఖ్యంగా విద్యార్థిని, విద్యార్థులు  ఒత్తిడికి గురికాకుండా  శారీరక వ్యాయామాలు,  క్రీడా కార్యక్రమాలు అలవర్చుకోవాలని,మానసికంగా దృఢంగా ఉంటారని విద్యార్థినులకు గేమ్స్ కిట్ ని  అందజేసి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలన్నారు.