calender_icon.png 10 September, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డెర సంక్షేమ సంఘం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

10-09-2025 07:55:01 PM

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): వడ్డెర సంక్షేమ సంఘం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నివాసం వద్ద అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులు రమేష్ మంజల్కర్ మాజీ ఎమ్మెల్యేని కలిశారు. నూతనంగా ఎన్నికైన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి అభినందించారు. అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వడ్డెర సంక్షేమ సంఘానికి నిరంతరం పనిచేస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుంజ శ్రీనివాస్, పెద్ద తిమ్మయ్య, డాన్ శీను, గోపాల్, హనుమయ్య, వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు.