10-09-2025 07:34:00 PM
నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) బుధవారం జిల్లా పర్యటన సందర్భంగా బాసర గెస్ట్ హౌస్ వద్ద జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) పూలమొక్క అందించి మంత్రిని ఆత్మీయంగా స్వాగతం పలికారు. భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, అదనపు ఎస్పీలు రాజేష్ మీనా, ఉపేంద్ర రెడ్డిలు కూడా పూల మొక్కలు అందించి మంత్రిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం పోలీసులు మంత్రికి గౌరవ వందనం సమర్పించారు.