10-09-2025 07:57:54 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్(Lake View Point)ను బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్(జిల్లా ఇన్చార్జి మంత్రి) జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao), స్థానిక శాసన సభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, నిర్మల్ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు వినోదం, విశ్రాంతి కలిగించేలా లేక్ వ్యూ పాయింట్ ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. పర్యాటక అభివృద్ధి, పచ్చదనం పెంపు, పట్టణ సుందరీకరణ దిశగా ఇటువంటి ప్రాజెక్టులు కీలకమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.