09-09-2025 06:26:10 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ప్రజా కవి కాళోజి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కమిషనర్ తన్నీరు రమేష్(Commissioner Thanniru Ramesh) కాళోజి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా కవి కాళోజి ఆలోచనలు సమాజంలో ప్రజాసేవ భావానను పెంపొందించి స్ఫూర్తిని నింపాయని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డి. ఈ సాయికిరణ్, మేనేజర్ మజాకా తో పాటు మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.