09-09-2025 05:57:00 PM
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు మంగళవారం చేపట్టిన పోలింగ్ ముగిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమవగా.. సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ నిర్వహించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 781 మందికి గాను 768 మంది పార్లమెంట్ సభ్యులు ఓటును వినియోగించుకున్నారు. ఈ ఓటింగ్ కు బీఆర్ఎస్, బీజేడి, ఎస్ఏడీ పార్టీ సభ్యులు దూరం వహించారు. కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) మొదటగా ఓటు వేశారు. ఈ పోల్‌లో అధికార ఎన్డీఏ అభ్యర్థి సీ.పీ రాధాకృష్ణన్, ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు ఉన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ హరివంశ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, ఎస్పీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ తదితరులు ఓటును వినియోగించుకున్నారు.