09-09-2025 06:09:52 PM
- ఈ నెల 13న జరిగే మెగా జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి..
- జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీపడ్డదగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులో, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసులు మరియు ఇతర రాజీ పడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని జిల్లా ఎస్పీ సూచించారు. రాజీ మార్గం రాజ మార్గమని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని సమయాన్ని, డబ్బులను వృధా చేసుకోవద్దని, జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు పోలీస్ సిబ్బంది రాజీ పడ్డ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని తెలిపారు.