calender_icon.png 1 January, 2026 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నయా జోష్

01-01-2026 01:01:47 AM

కరీంనగర్, డిసెంబర్31(విజయక్రాంతి): ఎన్నో జ్ఞాపకాలు.. మరెన్నో తీపిగుర్తులు.. కష్టాలు.. సుఖాలు.. ఆనంద క్షణాలు.. విషాద సంఘటన లను చరిత్రలో కలిపేస్తూ 2025 ఏడాది ముగిసిపో యింది. కొత్త ఆశలు.. కొంగొత్త ఆశయాలతో 2026వ సంవత్సరం ఆరంభమైంది. ఉమ్మడిజిల్లా ప్రజలు 2025 కు వీడ్కో లు పలికి.. 2026 నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. బు ధవారం అర్ధరాత్రి నుంచి గురువారం వేకు వ జామున వరకు సంబరాలు అంబరాన్ని అంటాయి. అర్ధరాత్రి 12 కాగానే.. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేక్కట్ చేసి ఆడిపాడా రు. కేకులు, కూల్ డ్రింక్ లకు గిరాకీ ఏర్పడిం ది. పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేశారు. కరింనగర్ సీటీలోని పలుచోట్ల పరిస్థితిని సీపీ గౌస్ అలం పర్యవేక్షించారు. 

కిక్కే కిక్కు..

 కరీంనగర్ జిల్లాలో డిసెంబర్ 31, 2025 సంవత్సరం వీడ్కోలును కిక్కుతో ముగిం చారు. రాష్ట్రంలోనే హైదరాబాద్, రంగారెడ్డి తర్వాత కరీంనగర్ జిల్లాలో 7 కోట్ల రూపా యల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెం బర్ 1 నుంచి 31 వరకు 100 కోట్ల పైనే అ మ్మకాలు జరిగాయి. జిల్లాలో 287 మద్యం షాపులు, 32 బార్ అండ్ రెస్టారెం ట్లు ఉన్నా యి. బెల్టు షాపులు వందల సంఖ్య లో ఉ న్నాయి. డిసెంబర్ 31 రోజున రాత్రి12 గం టల వరకు తెరిచి ఉంచారు. ఒక పక్క పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నప్పటికి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకునేందుకు మం దుబాబులు మద్యం షాపుల ఎదుట క్యూకట్టారు.

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఉన్న కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి, హుజూరాబాద్‌న యోజకవర్గా ల పరిధిలో పోలీసులు విస్తృతంగా రాత్రి 9 గం టల నుంచి గురువారం తెల్లవారుజాము వరకు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు, తనిఖీలు, పె ట్రోలింగ్ నిర్వహించారు. 50 కి పైగాపై డ్రం కెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. కరీంనగర్ సి పి గౌస్ అలం ఆధ్వర్యం లో పోలీసు లు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగ కుండా ప్రశాంతంగా ముగిశాయి. పోలీసుల భయానికి చాలామంది వేడుకలను కాలనీ ల్లో తమ తమ ఇండ్లవద్ద, అపార్ట్మెంట్ల వద్ద, దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్ లలో పంక్షనాళ్లలో నిర్వహించుకు న్నారు. ఎక్కువ సంఖ్యలో యువత రోడ్లపైకి వచ్చి వేడుకలు జరుపుకున్నారు.