calender_icon.png 26 October, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా నాగేంద్రునికి నాగుల చవితి పూజలు

25-10-2025 08:17:31 PM

సూర్యాపేట (విజయక్రాంతి): జిల్లావ్యాప్తంగా నాగుల చవితి వేడుకలను భక్తులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో గల దేవాలయాలలోని పుట్టల వద్దకు వెళ్లి మహిళలు పూలు, పాలతో ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి కార్తీక మాసం మొదటి శనివారం, నాగుల చవితిని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే భక్తులు తండోప తండములుగా పోటెత్తారు. పుట్ట వద్ద నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు చేశారు.