19-11-2025 07:38:31 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరిని ప్రభుత్వం ఆదేశించడంతో నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటర్నెట్ సెంటర్లలో జోరుగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. జిల్లాలో వివిధ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ కూడా టెట్ పరీక్షలో ఉత్తీర్ణత కావాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో పరీక్ష రాసేందుకు అవసరమయ్యే దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసుకుంటున్నారు. దీంతో ఇంటర్నెట్ కేంద్రాల్లో ఉపాధ్యాయుల సందడి కనిపిస్తుంది. ఈనెల 29 వరకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడవని ఉపాధ్యాయులు తెలిపారు.