calender_icon.png 28 January, 2026 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జున 100వ సినిమాలో చాన్స్

28-01-2026 12:42:49 AM

టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాగార్జున తన తర్వాతి ప్రాజెక్టును ప్రకటించిన విష యం విదితమే. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘కూలీ’ చిత్రంలో స్టైలిష్ విలన్‌గా ఆకట్టుకున్న నాగార్జున చేస్తున్న 100వ సినిమా ఇది. ఈ చిత్రం రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. తమిళంలో ‘నిత్తం ఒరు వానమ్’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన కార్తీక్‌కు తన కెరీర్‌లో మైలుచిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతలను నాగార్జున అప్పగించారు.

ఈ చిత్రంలో ముగ్గురు కథానాయకలు భాగం కానున్నారు. ఇప్పటికే సీనియర్ నటి టబును ఒక పాత్రకు ఎంపిక చేసిన టీమ్.. తాజాగా మరో భామను ఈ ప్రాజెక్టులోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ‘లవ్ మ్యారేజ్’ ఫేమ్ సుస్మిత భట్ ఈ సినిమాలో మరో కీలక పాత్రను పోషించనుంది. తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించటం ద్వారా దక్షిణాదిన తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న సుస్మితా భట్ 2021లో తెలుగులో ‘నాట్యం’ అనే సినిమాలో నటించింది. యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషనల్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.