28-01-2026 12:44:34 AM
బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించి తెలుగులోనూ వరుసగా సినిమాలతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది మృణాల్ ఠాకూర్. టాలీవుడ్‌లో ‘సీతారామం’ మొదలు వరుసగా అవకాశాలు అందుకుంటూ, ప్రతి సినిమాతో హిట్‌ను ఖాతాలో వేసుకుందీ భామ. త్వరలో అడివి శేష్‌కు జోడీగా ‘డకాయిట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో సంతృప్తికర కెరీర్‌తో ముందుకు సాగుతున్న మృణాల్ ఠాకూర్ త్వరలోనే తమిళ చిత్రసీమలోనూ అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది.
అది కూడా తమిళ్ స్టార్ హీరో శింబుతో ఆమె కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లు విపరీతంగా ఉంటాయని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తుండటమే ఇందుకు కారణం. ‘ఎస్‌టీఆర్51’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం టీమ్ మృణాల్‌ను ఎంపిక చేసినట్టు టాక్. ఈ సినిమాకు ‘కిల్లర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం.
డెసింగ్ పెరియా సామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్‌హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. రొమాంటిక్ హీరోగా ముద్ర వేసుకున్న శింబు కథానాయకుడిగా నటిస్తున్న 51వ సినిమాలో మృణాల్ ఠాకూర్‌కు హీరోయిన్‌గా అవకాశం దక్కటంపై ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.