25-10-2025 07:30:03 PM
దౌల్తాబాద్: రోడ్లపై వడ్లు, మొక్కజొన్నలు ఆరబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామ ఎస్సై గంగాధర అరుణ్ కుమార్ హెచ్చరించారు. శనివారం మండల పరిధిలోని పలుగ్రామాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడుతూ రోడ్లపై ధాన్యం ఆరబోయడం వల్ల వాహనాలు అదుపుతప్పి కిందపడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ధాన్యం ఆరబోతలకు కల్లాలను మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు.