18-10-2025 08:32:00 PM
గాంధారి,(విజయక్రాంతి): ఉపాధ్యాయులు ఆంగ్లభాష ను మెరుగుపరుచుకోవాలి అని ఆంగ్ల భాష సీనియర్ ఫ్యాకల్టీ జాన్సన్ అన్నారు. ఈ మేరకు శనివారం రోజున మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఇంగ్లీష్ భాషను మెరుగుపరచడం కోసం టీచర్స్ ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం లో దాదాపుగా 30 మంది టీచర్స్ , పాఠశాల యజమాన్యాలు పాల్గొని ఆంగ్లభాషలో సులభతర పద్ధతిలో విద్యార్థులకు ఏ విధంగా బోధించాలో ఆంగ్ల భాష విశ్లేషకులు తెలియజేశారు.
ఈ ప్రోగ్రాంలో పరశురాం (మ్యాథ్స్), సూరత్ రామ్ –ఫిజిక్స్, రాందాస్ –హిందీ, గంగారాం, –సోషల్,నితిన్ (కేరళ)–ఇంగ్లీష్, సబ్జెక్ట్ అనుభవజ్ఞులు తమ సహచర ఉపాధ్యాయులకు బోధన పద్ధతుల పట్ల ఉన్నటువంటి సులభతర పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సల్మా, జ్యోతి, కిషోర్, సదియా, స్వప్న, షిరీన్, రేణుక, నదియా, రజిత, మౌనిక, అశ్విని, సౌజన్య, మంజుల, దివ్య, ప్రణీత, అశ్విని , అరుణ , తదితరులు పాల్గొన్నారు.