15-09-2025 01:28:25 AM
బీజేపీ మభంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్
ముషీరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ఈ నెల 21న సాయంత్రం 7గంటలకు నెక్లస్ రోడ్లో నిర్వహించే 3కె నమో యువ రను విజయవంతం చేసేందుకు యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని బీజేపీ మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ముషీరాబాద్ వాలీబాల్ హాల్లో బీజేవైఎం నియోజకవర్గం కన్వీనర్ గడ్డం నవీన్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా భర త్ గౌడ్ మాట్లాడుతూ... ప్రధాని నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశం లో మాదకద్రవ్యాల నిర్మూలనకు బీజేపీ చేస్తున్న కృషిలో భాగంగా 3కె నమో యువ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో డ్రగ్స్ మహామ్మారిపై అవగాహన కల్పిస్తున్నాం అన్నారు. ర్యాలీలో ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మన్ లు హాజరవుతారని పేర్కొన్నారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుషాల్ గౌడ్, ఇన్చార్జి చిత్తరంజన్ గుప్తా, నాయకులు అనిల్ కుమార్, ఆయూష్, సాయి, చింటూ తదితరులు పాల్గొన్నారు.