26-01-2026 07:39:56 PM
ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం పోలీస్ స్టేషన్ లోని హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మట్టయ్యకు ఉత్తమ ఉద్యోగ అవార్డుకు ఎంపికయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ మిక్కిలేనేని మను చౌదరి చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. పోలీసు విభాగంలో 23 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ విధి నిర్వహణలో నిజాయితీ క్రమశిక్షణ అంకితభావం ఉత్తమ సేవను గుర్తించి ఈ ప్రశంస పత్రాన్ని పొందిన మట్టయ్యను నాచారం పోలీస్ స్టేషన్ సిబ్బంది అభినందించారు.