15 April, 2026 | 3:59 AM

దైవభక్తి చాటిన నరసింహగౌడ్

15-12-2025 12:07 AM

అమీన్ పూర్, డిసెంబర్ 14 పటేల్ గూడ పరిధిలోని బిఎస్‌ఆర్ కాలనీలో శ్రీ శివ పార్వతి అభయ ఆంజనేయ స్వామి ఆలయ షెడ్ నిర్మాణానికి అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ రూ.1,00,000 విరాళంగా అందించి ఉదారత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక, ఆధ్యాత్మిక సేవలు అందించడంతో ముందుండే నరసింహగౌడ్ సేవలను కొనియాడారు.