calender_icon.png 23 August, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలి

22-08-2025 02:16:36 AM

తెలంగాణ కార్మిక సమాఖ్య డిమాండ్

ముషీరాబాద్, ఆగస్టు 21(విజయక్రాంతి): రాష్ట్రంలో ఉన్న పోడు భూములు, పంచరాయి భూములు, అసైన్ మెంట్ భూ ములకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పట్టా లు ఇవ్వాలని తెలంగాణ కార్మిక సమాఖ్య (టీకేఎస్) డిమాండ్ చేసింది. అన్ని రంగాల్లో పని చేస్తున్న కార్మికుల హక్కుల సాధనకై గురువారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పా టు చేసిన సమావేశంలో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కలకోటి రామన్న, ప్రధాన కార్యదర్శి బందెల యాదగిరి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చిలుముల్ల సుజాత మా ట్లాడుతూ అన్ని రంగాల్లో పని చేస్తున్న కార్మికు లకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఈఎస్‌ఐ, పీఎఫ్ వర్తింపజేయాలన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల ను వెంటనే పర్మినెంట్ చేయాలని, వి ద్యా, వైద్యాన్ని ప్రభుత్వాలు ఉచితంగా అం దించాలన్నారు.  పేద కార్మికులకు 200 గజాల ఇం డ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. గ్రామీణ పేదలకు 3 ఎకరాల సాగు భూమిని ఇవ్వాలని, విద్యావంతులైన నిరుద్యోగులకు అర్హత కలిగిన కార్మికులకు అన్ని కార్పొరేషన్ల ద్వారా రూ.25 లక్షల రుణం మంజూరు చేయాలన్నారు. 

ప్రమాదవశాత్తు ఏ కార్మికుడైన చని పోతే వెంటనే రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, వికలాంగులైన కార్మికులకు రూ. 10 లక్షల రుణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో పని చేస్తు న్న అసంఘటిత, సంఘటిత కార్మికుల హక్కు ల సాధనకై త్వరలో ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యాతాకుల ఈశ్వర్, ఉపాధ్యక్షులు వేల్పుల వెంకట సాయిలు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కన్న కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.