calender_icon.png 28 June, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంజాయ్ మెంట్ సర్వే ప్రకారం పట్టాలు ఇవ్వాలి

11-06-2025 01:55:21 PM

భూభారతి సదస్సు వద్ద రైతుల నిరసన

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఎంజాయ్ మెంట్ సర్వే ప్రకారం తాము సాగు చేసుకుంటున్న భూములకు భూభారతి ద్వారా పట్టాలు ఇవ్వాలని మహబూబాబాద్ జిల్లా నారాయణపురం గ్రామ రైతులు రెవెన్యూ సదస్సు వద్ద నిరసన తెలిపారు. ధరణి కార్యక్రమానికి ముందు తమ గ్రామ రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఉండగా, ధరణి లో తమ భూములను అటవీ భూములుగా పేర్కొనడం వల్ల కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయకుండా నిలిపివేశారని రైతులు ఆరోపించారు. ఈ సమస్యను గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ శాఖ అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించారని, ఆ ప్రకారంగా సాగులో ఉన్న ప్రతి రైతుకు పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం రెవెన్యూ సదస్సుకు హాజరైన ఉప తహసిల్దార్ ఎర్రయ్యకు వినతిపత్రం అందజేశారు.