28-06-2025 05:37:04 PM
కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో శనివారం రోజున, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని, మెయిన్ హాస్పిటల్ లో సింగరేణి హాస్పిటల్ సీఎంఓ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కరణ్ రాజ్ కుమార్ ను మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోదుగ జోగారావు శనివారం మర్యాద పూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలబొకే, శాలువాతో ఘనంగా సన్మానించి నల్ల బంగారం వెలుగు సూర్యులు,తెలంగాణ రాష్ట్రాన్ని వెలుగులతో విరజిల్లింపజేస్తున్న సింగరేణి కార్మికులకు, సేవలు చేస్తున్న, సింగరేణి హాస్పిటల్ యాజమాన్యంకు,సింగరేణి హాస్పిటల్ సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపినారు.