calender_icon.png 2 January, 2026 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన కమిటీల ఎన్నిక

02-01-2026 06:12:17 PM

నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పద్మశాలి సంక్షేమ సంఘం శ్రీ లక్ష్మీ గణపతి, శివ మార్కండేయ, దుర్గామాత దేవాలయాల నూతన కమిటీని ఈనెల నాలుగవ తేదీన ఎన్నుకోవడం జరుగుతుందని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు గాదాసు బాబు శుక్రవారం తెలిపారు. ఈ ఎన్నికలు గౌరవ అధ్యక్షులు గడ్డం సుధాకర్, ప్రధాన కార్యదర్శి దేవేందర్, పట్టణ అధ్యక్షుడు రామ్ సత్తయ్య, మందమర్రి పట్టణ అధ్యక్షుడు చిరగోని సుదర్శన్ లు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తారనీ అన్నారు. ఎన్నికలకు పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.