calender_icon.png 2 January, 2026 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదాడ మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల

02-01-2026 06:29:33 PM

కోదాడ: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 35 వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం మున్సిపాలిటీలో మొత్తం 58,601 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారికంగా వెల్లడైంది. వీరిలో 28,069 మంది పురుష ఓటర్లు, 30,520 మంది మహిళా ఓటర్లు, అలాగే ఇతరులు 12 మంది ఉన్నారు. పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హంగా మారింది.

వార్డు వారీగా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే, 18వ వార్డులో అత్యధికంగా 2,378 మంది ఓటర్లు నమోదు కాగా, 31,32,19వ వార్డులలో కూడా ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు 16వ వార్డులో 1,298 మంది ఓటర్లతో అతి తక్కువ సంఖ్య నమోదైంది. 35 వార్డులకు సంబంధించిన పూర్తి ఓటర్ల లిస్టును మున్సిపాలిటీ కార్యాలయ డిస్ప్లే బోర్డు వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో మరోసారి పరిశీలించుకోవాలని, ఏవైనా తప్పులు, సవరణలు లేదా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. రానున్న ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.