02-01-2026 06:15:23 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై ఎస్సై సర్తాజ్ పాషా అవగాహన ర్యాలీ వీధుల గుండా నిర్వహించారు. జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులచే నినాదాలు చేస్తూ రోడ్డు భద్రతపై ప్రధాన చౌరస్తాలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, వాహనదారులు వాహనాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణం ప్రమాదకరమని రోడ్డు భద్రత గురించి పలు సూచనలు సలహాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి డాక్టర్ సునీత, అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది, వార్డ్ మెంబర్ సామల తిరుపతి, విద్యార్థులు పాల్గొన్నారు.