02-01-2026 06:47:35 PM
జిల్లా కలెక్టర్ చే ఎస్టియు దైనందిని ( డైరీ) ఆవిష్కరణ
నిర్మల్: జిల్లాలో విద్యా ప్రమాణాల పెంపుకు ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు శుక్రవారం ఎస్సీయుటీయుటీఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, ఉపాధ్యాయులు మరింత శ్రమించి పదవ తరగతి ఫలితాలలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని అభిలషించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో ఉపాధ్యాయులు నిర్వహించిన కుటుంబ సర్వే పారితోషకం త్వరగా చెల్లించాలని కోరగా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎస్. భూమన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి జె. లక్ష్మణ్, ఆర్థిక కార్యదర్శి బి. వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు ఇర్ఫాన్ షేక్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎం. నాగభూషణ్, నిర్మల్ పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.లక్ష్మీనారాయణ, ఖాళిద్ హైమద్, సోను మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్.అశోక్ కుమార్, ఎం.సీ. నరసయ్య, నిర్మల్ గ్రామీణ మండల అధ్యక్షులు తాళ్ల రవి, సారంగాపూర్ మండల అధ్యక్షులు మటన్ పరమేశ్వర్, దిలావర్ పూర్ మండల ప్రధాన కార్యదర్శి