02-01-2026 06:37:57 PM
- క్లాప్ కొట్టి ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి
గజ్వేల్: రేణుక ఫామ్ ట్రీ పిక్చర్స్, ఏఐకే వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కోటమైసమ్మ గ్యాంగ్ సినిమా ప్రారంభోత్సవం గజ్వేల్ ఎల్లమ్మ దేవాలయంలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని క్లాప్ కొట్టి చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గజ్వేల్‌కు చెందిన ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధించి, ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.
సినిమాల ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుందని, అందుకే సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే చిత్రాలు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత, దర్శకుడు, కథా రచయిత ఉపేందర్ గౌడ్, సంఘ సేవకులు డాక్టర్ దేశబోయిని నర్సింహులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ రాజు, ఎల్లమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ గణేష్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు రాజు గౌడ్, హీరో విజయ్ రాజ్ కుమార్, హీరోయిన్ కీర్తి, సంగీత దర్శకులు ప్రకాశ్ చెరుకూరి, నర్సింహా చారి, నటీనటులు మణికుమార్, ఆజీ మామ, బాషా, చిరంజీవి, మోహన్, నితిన్, సాంకేతిక నిపుణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.