02-01-2026 07:05:34 PM
సీఐ బాలాజీ వరప్రసాద్
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఆదర్శ పాఠశాల, బీఈడీ, డిగ్రీ కళాశాలల విద్యార్థుల భద్రతను మరింత పెంచే ఉద్దేశంతో స్కూల్ జోన్ బోర్డు, బస్ రిక్వెస్ట్ స్టాప్‌ను ఏర్పాటు చేసినట్లు సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు నెమ్మదిగా వాహనాలు నడపాలని, విద్యార్థులు రోడ్డు దాటేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
రోడ్డు ప్రమాదాలను నివారించడమే ప్రధాన లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.ఈ ఏర్పాట్ల వల్ల విద్యార్థులు రోడ్డు దాటడం మరింత సురక్షితంగా మారుతుందని, తల్లిదండ్రులు కూడా నిశ్చింతగా ఉండాలన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు,తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సీఐని అభినందించారు.