02-01-2026 07:12:34 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): విద్యుత్ బిల్లులు స్వీకరించు కేంద్రాన్ని మార్చినట్లు విద్యుత్ శాఖ ఏఈ కిషోర్ కుమార్ శుక్రవారం తెలిపారు. గతంలో విద్యుత్ బిల్లులు స్వీకరించే కేంద్రం ఈ ఆర్ ఓ కార్యాలయంలో ఉండేదని వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు వచ్చిన సమయంలో పై అంతస్తులో ఉన్న భవనంలోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుండడంతో వినియోగదారుల కోరిక మేరకు స్థానిక ఏఈ కార్యాలయం వద్ద సివిల్ ఆసుపత్రి ప్రక్కకు మార్చ బడిందని గతంలో ఏఈ కార్యాలయంలోనే స్వీకరించడం జరిగిందని ప్రస్తుతం అదే స్థలంలో విద్యుత్ బిల్లులు స్వీకరిస్తామని వినియోగదారులు గమనించాలని ఆయన కోరారు.