15-10-2025 12:20:39 AM
-రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఉత్తమ సేవా పథకం అవార్డు.
-విద్యార్థి దశ నుండే సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి..
-ఆ విద్యార్థుడికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చి పెట్టింది.
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన పెంచుకుని వాటిపై కొంతమందికైనా ఉపయోగపడే విధంగా అవగాహన కల్పించడంలో తన వంతు బాధ్యతని నిర్వర్థించాడు. జాతీయ సేవా పథకం ఎన్‌ఎస్‌ఎస్. విద్యార్థిగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఉత్తమ సేవా పథకం అవార్డును సాధించాడు. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లి గ్రామానికి చెందిన వంగపల్లి మణిసాయి వర్మ తెలంగాణ రాష్ట్రం నుండి ఉత్తమ సేవా పథకం సాధించాడు.
ఈ నెల 6న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకని జిల్లా వచ్చిన మణిసాయి వర్మను పలువురు అభినందించారు. 2019 - 2023 నుండి 2025 వరకు జాతీయ సేవా పథకం ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు మణిసాయి విజయక్రాంతి తో చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్, మహిళా సాధికారత, వ్యవసాయరంగానికి సంబందించి రైతులకు అవగాహన కల్పించడం, స్వచ్ఛ భారత్, ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన, డిజిటల్ ఇండియా వంటి సామాజిక కార్యక్రమాలలో తన వంతు బాధ్యతగా క్యాంపులు చేపట్టారు. మారుమూల గ్రామం నుండి వచ్చిన తనకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ సేవా పథకానికి మణిసాయి వర్మ ఎంపికై రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం పట్ల తల్లిదండ్రులు వంగపల్లి మల్లేశం, భాగ్యలు హర్షం ఆనందం వ్యక్తం చేశారు.