calender_icon.png 15 October, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ శివారులో యువతులతో రేవ్ పార్టీ

15-10-2025 08:38:47 AM

హైదరాబాద్: రంగారెడ్డి(Rangareddy) జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లిలో రిసార్టుపై పోలీసులు దాడి చేశారు. కె. చంద్రారెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించారు. ఉద్యోగులు, డీలర్లకు రిసార్టులో గుంటూరుకు చెందిన ఫెర్టిలైజర్ కంపెనీ డీలర్ పార్టీ ఇచ్చారు. పార్టీలో విదేశీ మద్యం వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. మద్యం తాగి యువతులతో పార్టీ చేసుకున్నట్లు పోలీసులు(Maheshwaram Police) వెల్లడించారు. ఇద్దరు డీలర్లు, రిసార్టు యజమాని, మేనేజర్ తో సహా 200 మంది యువతులు, 56 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిసార్టులో యువతులతో కలిసి పార్టీకి అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ పార్టీలో కేవలం లిక్కర్ మాత్రమే లభించిందని, ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పార్టీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మహేశ్వరం పోలీసులు తెలిపారు.