calender_icon.png 6 August, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

06-08-2025 12:00:00 AM

మందమర్రి, ఆగ స్టు 5 : పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అం దుగులపేట ఫ్లైఓవర్ వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కూనారపు వంశీ (32) మృతి చెందాడు. పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా డోర్నకల్ కు చెందిన కునారపు వంశీ తన అత్తమ్మ ఊరైన ఐబి తాండూర్‌కు తన ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో సోమవారం రాత్రి పట్టణంలోని మేడారం ఫ్లైఓవర్ వంతెనపై తన ద్విచక్ర వాహనాన్నీ పక్కకు ఆపి ఉండగా, మంచిర్యాల వైపు  అతివేగంగా వెళ్తున్న లారీని డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ ద్విచ క్ర వాహనాన్ని వెనక నుండి ఢీ కొట్టగా బాధితునికి తీవ్ర గాయాలు కావడంతో  వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించ గా, పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. కాగా మృతునికి భార్యతో పాటు ఐదు నెలలబాబు ఉన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ ఎస్ రాజశేఖర్ తెలిపారు.