14-09-2025 06:21:13 PM
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మైల నరసింహ
చిట్యాల,(విజయక్రాంతి): విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17 న ప్రతి బూత్ లో జాతీయ జెండా ఆవిష్కరణ చేయాలని బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మైల నరసింహ ఆదివారం నిర్వహించిన పార్టీ మండల సమావేశంలో సూచించారు. బీజేపీ చిట్యాల మండల అధ్యక్షుడు పీక వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా పక్షం మండల కార్యశాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు మైల నరసింహ మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడీ 75 వ జన్మదినం సందర్భంగా పక్షం రోజులు కార్యకర్తలు అధిక సంఖ్యలో రక్తదాన కార్యక్రమాలు చేయాలని, దివ్యాంగులకు వారి ప్రతిభను గుర్తించి సన్మానం చేయాలనీ, ప్రతి బూత్ లో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. అలాగే విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రతి బూత్ లో జాతీయ జెండా ఆవిష్కరణ చేయాలని సూచించారు. అనంతరం పీక వెంకన్న మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాలలో పోటీ చేయాలని సూచించారు.