calender_icon.png 11 August, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాదాత తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు

11-08-2025 07:35:26 PM

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ యూనివర్సిటీ(Telangana University) సౌత్ క్యాంపస్ లో ప్రముఖ సేవ తత్పరులు, విద్యాదాత తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు డాక్టరేట్ అసోసియేషన్ అధ్యక్షులు డా. సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథి ప్రిన్సిపల్ డా. ఆర్. సుధాకర్ గౌడ్ హాజరై కేక్ కట్ చేసి మాట్లాడారు. విద్యాభివృద్ధికి సుభాష్ రెడ్డి పడుతున్న తపన ఎంతో గొప్పదని గుర్తుచేశారు.

ఈ ప్రాంతానికి సుభాష్ రెడ్డి ఆదర్శ ప్రాయులనీ, పేదలకు ఇల్ల నిర్మాణం, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం తన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని కొనియాడారు. అనంతరం డా. సంతోష్ గౌడ్ మాట్లాడుతూ, సౌత్ క్యాంపస్ తో తనకు అవినాభావ సంబంధం ఉందని పలు సందర్భాల్లో తెలిపారని అన్నారు. ఎల్లపుడూ క్యాంపస్ కు తన సహాయ సహకారాలు అందిచడానికి ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో డా. అంజయ్య, డా. మోహన్ బాబు, డా. లలితా, డా.యాలాద్రి, డా. సరిత, డా. రమాదేవి, డా. దిలీప్, డా. సునీత, కె. వైశాలి, డా. శ్రీమాత.. డా. దాస్, అధ్యాపక ,విద్యార్థులు పాల్గొన్నారు.