11-08-2025 07:51:34 PM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): మండల ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను,ఇతర ప్రభుత్వ సంస్థలను తప్పనిసరిగా సందర్శించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రాధామ్య పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత మండల ప్రత్యేక అధికారులపై ఉందని అన్నారు. వారి పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలను తరచు ప్రత్యేక అధికారులు తనిఖీ చేయడమే కాకుండా, సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛత పై రూపొందించిన "హర్ ఘర్ తిరంగా హార్ ఘర్ స్వచ్ఛత" గోడపత్రికను ఆవిష్కరించారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్పెషల్ కలెక్టర్ సీతారామారావు,ఇంచార్జ్ డి ఆర్ ఓ నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి,ఆర్ డి ఓ లు రమణారెడ్డి, శ్రీదేవి ,గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.