11-08-2025 07:57:26 PM
గురుకులాల వెజిటబుల్, ప్రొవిజన్స్ సప్లై కాంట్రాక్టర్ల డిమాండ్
గురుకులాల కాంట్రాక్టర్ల అసోసియేషన్ల్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District)లోని ఆయా గురుకుల పాఠశాలల్లో వెజిటేబుల్స్, ప్రొవిజన్స్, సప్లై కాంట్రాక్ట్ అసోసియేషన్, కామారెడ్డి వారి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. నూతన టెండర్ విధానం వద్దు, పాత టెండర్ విధానంని అమలు చేయాలి అనే డిమాండ్తో జిల్లా కలెక్టర్ ను కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. 800 కుటుంబాలు రోడ్డున పడతాయని కలెక్టర్కు వివరించారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పాడడమే కాకుండా తమ ఉపాధి దెబ్బతింటుందని వాపోయారు. అనంతరం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా వ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు కూరగాయలు పండ్లు ఆహార పదార్థాల ముడి సరుకులు అందజేసే కాంట్రాక్టర్లు ఆందోళన చేస్తూ డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలలో పాత టెండర్ విధానాన్ని అమలు పరచాలని లేనియెడల 13వ తారీకు నుండి పాఠశాలలకు అందజేయాల్సిన ముడి సరుకులు నిలిపివేస్తామని వినతి పత్రం అందజేశారు.
గత నాలుగు నెలల నుండి ఎటువంటి బిల్లులు రావడం లేదని అన్నారు.చాలా ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. కొత్త టెండర్ విధానంలో చాలా కఠిన నియమ నిబంధనలు చాలా ఉన్నాయని వాటిని అనుకరించే ఆర్థిక స్తోమత తమకు లేదని పాత టెండర్ విధానాన్ని అవలంబించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మూడుసార్లు సప్లై చేయాల్సిందిగా వచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని లేని యెడల ఈనెల 13 నుండి గురుకుల పాఠశాలలకు కూరగాయలు, ముడి సరుకులతో పాటు పాలు, పండ్లు నిలిపివేసి నిరసన తెలియజేస్తామన్నారు. గత 4 నెలల నుండి తమకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం నుంచి రావడం లేదని వాపోయారు. ఇప్పటికే గురుకులాలకు కోడిగుడ్ల సరఫరా చేసే టెండర్ కార్పొ కార్పొరేట్ ఏజెన్సీకి అప్పగించి ఒక్క జిల్లాలో రోజుకు రెండు లక్షల చొప్పున ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్న కార్పొరేట్ ఏజెన్సీకి టెండర్ అప్పగించారు అన్నారు. 47 మంది చిన్న కాంట్రాక్టర్ రోడ్డున పడ్డారన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి తో పాటు నవీన్, శ్రీనివాస్, హిభాదుల్లా, రమేష్, కుమారస్వామి, బాలకిషన్, వినోద్, మటన్ కిషన్,అమీన్, ఇమాన్యుల్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.