11-08-2025 08:07:31 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): వరంగల్ ఆరెపల్లిలో వికాస్ తరంగిణి, ప్రతిమ ఫౌండేషన్, ప్రతిభ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం(Free Mega Cancer Medical Camp) నిర్వహించనున్నట్లు డాక్టర్ బచ్చ రాధాకృష్ణ తెలిపారు. అనంతరం మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నేటి నుంచి ఒక సంవత్సర కాలం పాటు ఉచిత మెగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్రింది లక్షణాలున్న వారు రొమ్ము, నోటి గొంతు, అల్సర్, కడుపునొప్పి, కామర్లు, దమ్ము మొదలగు లక్షణాలతో బాధపడుతున్న వారు ఈ క్యాంపు నందు క్యాన్సర్స్ తిని ఉచితంగా చేయించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బచ్చ రాధాకృష్ణ, డాక్టర్ తిప్పన అవినాష్, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, శ్రీమాన్ దయాకర్ రెడ్డి, ఎలగందుల రాజేందర్, తిరుమల్ రావు, మలాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.