11-08-2025 07:59:23 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహిళల రక్షణ షీ టీం లక్ష్యమని ఎస్ఐ సునంద(SI Sunanda) అన్నారు. నెల్లికుదురు ఎస్ఐ చిర్ర రమేష్ బాబు(SI Chirra Ramesh Babu) ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్, చెడు వ్యసనాలు, హ్యూమన్ ట్రాఫికింగ్, ఫోక్సో చట్టం, భరోసా కార్యక్రమం అమలుపై కళా జాగృతి బృందం ద్వారా ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుప్రజ, రేణుక, సతీష్ కుమార్, తిరుపతి, పృధ్విరాజ్, బేబీ, ప్రిన్సిపల్ సంతోష్ పాల్గొన్నారు.