11-08-2025 08:01:19 PM
నిర్మల్ (విజయక్రాంతి): దిల్వార్పూర్ మండలం(Dilawarpur Mandal) కదిలి శివారులోని స్వయంభు నంది పాదం ఆలయంలో ఈనెల 13న ఆలయ వార్షికోత్సవంలో భాగంగా వివిధ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అర్జున్ రెడ్డి తెలిపారు. ఉదయం నుండి ఆలయంలో శివ మంగళ గౌరీ వ్రతం పూజా కార్యక్రమాలు అన్నదానం భక్త భజన మండలి పాటల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవాలని సూచించారు.