05-07-2025 02:01:08 AM
గడువు గురించి అంతగా పట్టించుకోం: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ, జూలై 4: గడువు సమీపిస్తుందని వాణిజ్య ఒందాలను ఖరారు చేసుకునేందుకు భారత్ ఎప్పుడూ తొందరపడదని శుక్రవారం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఏ ఒప్పందం అయినా రెండు వర్గాలకు లాభదాయకంగా ఉంటేనే భారత్ అంగీకరిస్తుందన్నారు.
భారత్ మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం చివరి దశలో ఉందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో పీయూష్ గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఇరు పక్షాలకు లబ్ధి చేకూరేలా ఒప్పందం ఉండాలి. అది దేశ ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలి. అభివృద్ధి చెందిన దేశాలతో పరస్పర చర్చలకు భారత్ సిద్ధంగా ఉంది.’ అని స్పష్టం చేశారు.