07-07-2025 12:27:35 AM
పాల్గొన్న పుల్లెల గోపీచంద్
ముషీరాబాద్, జూలై 6 (విజయక్రాంతి) : యువతలో క్రీడాస్ఫూర్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించాలనే లక్ష్యంతో హైదరాబాదుకు చెందినది గాడియం స్కూల్ ’జిమ్క్విన్’ రెండో ఎడిషన్ను ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేతుల మీదుగా ప్రారంభించినట్లు స్కూల్ డైరెక్టర్ కె.కీర్తి రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ ఈవెంట్లో దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 850 మంది యువ జిమ్నాస్ట్లు పాల్గొంటారని తెలిపారు.