calender_icon.png 19 December, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జాతీయ పెన్షన్ దినోత్సవం

18-12-2025 12:00:00 AM

చేగుంట, డిసెంబర్ 17 : చేగుంట పట్టణ కేంద్రంలోగల విశ్రాంత ఉద్యోగుల భవనంలో జాతీయ పెన్షన్ దినోత్సవాన్ని మండల అధ్యక్షులు  కరణం నర్సిములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మండలంలో ఉన్న పత్రిక విలేకరులకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్బంగా నర్సింలు మాట్లాడుతూ  డిసెంబర్ 17వ తేదీని భారతదేశంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవంగా  జరుపుకుంటున్నామని, ఆరోజు 1982లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును ఇచ్చిందని, అ తీర్పు పెన్షనర్ల గౌరవాన్ని, హక్కులను కాపాడిందిఅని అన్నారు,

అరోజు నుండి పెన్షనర్లు, తమ సమస్యలను, విజయాలను పంచుకుంటూ, ప్రభుత్వం నుండి మెరుగైన సేవలు ఆశిస్తూ వేడుకలు జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమం లో కరణం నర్సింలు, చికోటి చంద్రశేఖర్, రామచందర్, మ్యాకల జయరాములు, అయిత చంద్రమౌళి, చిదం మహిపాల్ రెడ్డి, తాళ్లపల్లి రాజేశ్వర్, సంగ వీరయ్య, ప్రభాకర్, చల్ల కిషన్, రజనకు విట్టల్, చిటిమిల్ల శంకరయ్య, ఏనుగుల సాయిలు, నాగరాజు, కంశెట్టి రాములు, కమ్మరి పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.