18-12-2025 12:00:00 AM
చేగుంట డిసెంబర్ 17 : చేగుంట మండలం చందాయిపెట్ గ్రామ సర్పంచ్ తాలూకా మహేశ్వరీ, సాయిబాబా, ఉపసర్పంచ్ పబ్బ నగేష్ గుప్తా ఆధ్వర్యంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా వారిని శ్రీనివాస్ రెడ్డి వారిని శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అందేటట్లు చూడాలని అన్నారు.
రాబోయే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు తాడేపు వెంగల్ రావు,సర్పంచ్, తాలూకా మహేశ్వరీ, సాయిబాబా, ఉప సర్పంచ్ పబ్బ నాగేష్ గుప్తా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ ముజామిల్,వార్డ్ మెంబర్ మారబోయిన మంగ,రామగౌడ్, దప్పు ఉమారాణి,కుమార్,కాంగ్రెస్ సినియర్ నాయకులు మారబోయిన స్వామి గౌడ్, బాసా రాజు, అవుబోతు నాగరాజు, మైనారిటీ నాయకులు అక్బర్, తదితరులు పాల్గొన్నారు.