18-12-2025 12:08:21 AM
ముకరంపుర, డిసెంబరు 17 (విజయక్రాంతి): నగరంలోని టీఎన్జీవో భవనంలో టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో బుధవారం జాతీయ పెన్షనర్స్ డే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా టీపీసీఏ అసోసియేషన్ అధ్యక్షులు పెండ్యాల కేశవ రెడ్డి, ఎలదాసరి లింగయ్య అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ గారు, ఆర్డీవో మహేష్ కుమార్ పాల్గొని నకారా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పెన్షన్ అనేది భిక్ష కాదని, దయాదాక్షిణ్యం కాదని, 3035 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన ఉద్యోగికి వృద్ధాప్యంలో సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసిందని తెలిపారు. పెన్షన్ వ్యవస్థను పునరుద్ధరింపజేసిన నకారా న్యాయపోరాటానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే పెన్షనర్లు ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు సమిష్టి పోరాటం అవసరమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గాజుల నరసయ్య, జిల్లా కార్యదర్శి సంగేం లక్షణరావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపెల్లి కాళీచరణ్, కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఏ.ఎం. హమీద్, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుద్దాల రాజయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు రాగి శ్రీనివాస్, సర్దార్ అర్విందర్ సింగ్, గూడ ప్రభాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్, హజ్గర్ భరద్వాజ్, చల్ల మోహన్ రెడ్డి, నాగుల రాజారామ్, ఆదిరెడ్డి లక్ష్మీరాజం, నరసింహ చారి, మక్సుద్ మీర్జా, సత్తయ్య, ఎల్లయ్య, పద్మారావు, రాజయ్య, లచ్చిరెడ్డి, సుధాకర్, లక్ష్మి, దయాకర్ రావు, భగవాన్ రెడ్డి, అమ్మ రాజయ్య, నరసయ్య, మహమ్మద్ అజ్గర్ అలీ తదితర ఉద్యోగ సంఘాల నాయకులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 800 మంది పెన్షనర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 80 మంది సీనియర్ సిటిజన్లను శాలువాలు, మెమొంటోలతో సత్కరించారు. పెన్షనర్లకు భోజన సదుపాయాలు, ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి ఘనంగా గౌరవించినందుకు టీఎన్జీవోల సంఘానికి పెన్షనర్ల సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు.